– కల్తీ ఎరువులు. విత్తనాలను అరికట్టాలి
– ఏఐకేఎంఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కునుకుంట్ల సైదులు
ఆత్మకూర్.ఎస్, జూన్ 29 : యూరియా యాప్ను రద్దు చేయాలని, కల్తీ ఎరువులు, విత్తనాలను అరికట్టాలని ఏఐకేఎంఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కునుకుంట్ల సైదులు అన్నారు. సోమవారం ఆత్మకూర్ తాసీల్దార్ ఆఫీస్ ముందు నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. వానాకాలం సీజన్ ప్రారంభం అయింది. ఈ సీజన్లో వివిధ రకాల పంటలను ఉత్పత్తి తీయడానికి రైతాంగం పెద్ద ఎత్తున ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకుంటుంది. దీనిని ఆసరా చేసుకుని కొన్ని నకిలీ కంపెనీలు నకిలీ విత్తనాలను రైతాంగానికి అమ్ముతూ మోసం చేస్తున్నారు. నకిలీ విత్తనాలను అరికట్టే చర్యలకు పూనుకోవాలని, గత సంవత్సరం యూరియా యాప్ ద్వారా ఇవ్వడంతో రైతాంగం తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలిపారు.
తిరిగి అలాంటి సమస్యలు పురాతన కాకుండా ఉండాలంటే తక్షణమే యూరియా యాప్ ను రద్దు చేయాలన్నారు. వానాకాలం సాగుకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. ముందుగానే రైతు భరోసాను రైతుల ఖాతాలో జమ చేయాలన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టాలని. రైతులకు బ్యాంకు రుణాలు సకాలంలో అందజేయాలన్నారు. అలాగే అన్ని రకాల సన్నాలకు బోనస్ ప్రకటించాలని కోరారు. ఒకవైపు రైతే రాజు అని చెప్పుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పడం తప్ప రైతాంగానికి కావాల్సిన సౌకర్యాలను మెరుగు పరచలేదన్నారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు ఎస్.కె మై బెల్లి. కొండేటి సంజీవరెడ్డి. ఏఐకేఎంఎస్ డివిజన్ ఉపాధ్యక్షులు డేగల వెంకటకృష్ణ. వీరా నాయక్. పన్నాల వెంకటరెడ్డి. పగడాల సుధాకర్ రెడ్డి. సోమిరెడ్డి ఉపేందర్ రెడ్డి. పగిడి ఎల్లయ్య. ఎస్కే గఫార్. బోల్కా భిక్షం. పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు నల్గొండ నాగయ్య. పి ఓ డబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల నర్సక్క, చల్ల రవీందర్ రెడ్డి, బాదే రాములు, మెట్టు సోమయ్య, దాసరి సైదులు. భిక్షం, భయ్యా వెంకన్న పాల్గొన్నారు.