గరిడేపల్లి, మే 30 : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ ప్రభుత్వం ఏకరూప దుస్తులు అందిస్తుందని గరిడేపల్లి మండల విద్యాధికారి పానుగోతు చత్రునాయక్ తెలిపారు. శుక్రవారం స్థానిక విద్యావనరుల కేంద్రంలో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యార్ధులకు అందించే యూనిఫామ్స్ అందజేశారు.
విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ అన్ని పాఠశాలలకు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాద్యాయులు వెంకట్రెడ్డి, సైదులు, బాల సైదిరెడ్డి, చంద్రయ్య, రవీందర్రెడ్డి, పాపయ్య, ముత్యాలరావు, లక్షీనారాయణ, నాగేశ్వరరావు, రమేశ్, మంగమ్మ, నాగేశ్వర్రావు, సీఆర్పీలు రామకృష్ణ, రాములు, వెంకటేశ్వర్లు, అశోక్, కోటయ్య పాల్గొన్నారు.