గరిడేపల్లి, జూన్ 2 : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులందరికీ ప్రభుత్వం ఏకరూప దుస్తులు అందిస్తుందని గరిడేపల్లి మండల విద్యాదికారి పానుగోతు చత్రునాయక్ అన్నారు. సోమవారం స్థానిక విద్యావనరుల కేంద్రంలో మండలంలోని గడ్డిపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్ధులకు యూనిఫామ్స్ అందజేశారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాద్యాయులకు విద్యార్ధులకు అందించే ఏకరూప దుస్తులను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సీఆర్పీలు, సిబ్బంది పాల్గొన్నారు.
Garidepally : విద్యార్ధులందరికీ యూనిఫామ్స్ : ఎంఈఓ చత్రునాయక్