చివ్వెంల, మే 12 : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గుట్టల్లో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రయుక్త శ్రీ నృసింహ జయంతి సందర్భంగా స్వామివారికి శ్రీదేవి భూదేవి లతో ఆదివారం రాత్రి మహా వైభవంగా కల్యాణం జరిపించారు. అరవిందాచార్యుల ఆధ్వర్యంలో స్వామి వారి కల్యాణం జరిగింది. సోమవారం వైశాఖమాస పౌర్ణమి సందర్భంగా ఆలయంలో కిరణ్ కుమారాచార్యులు, ఆలయ అర్చకులు శ్రీమాన్ కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదానం చేశారు. ఉండ్రుగొండ గ్రామ కోలాట సభ్యుల ఆటపాటలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పాల్గొన్నారు.
Chivvemla : వైభవంగా ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి కల్యాణం