యాదాద్రి,భువనగిరి : అవినీతి అధికారులపై ఏసీబీ ( ACB ) అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. సోమవారం ఉదయం నిర్మల్ జిల్లాలో ఇద్దరు ఏసీబీకి పట్టుబడగా యాదాద్రి జిల్లా ( Yadadri district )లో మరో ఇద్దరు లంచం తీసుకుంటూ పట్టు బడ్డారు.
జిల్లాలోని ఆలేరు మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వేముగంటి పూర్ణచందర్ రావు ( RI Purnachander Rao) , గ్రామ పాలనాధికారి షేక్ అహ్మద్ ( Shaik Ahmed ) ఫిర్యాదుదారుడు నుంచి రూ.14 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు.
భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వ్యవహారంలో లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదుచేశాడు. దీంతో ఏసీబీ అధికారుల సూచన మేరకు ఫిర్యాదుదారుడు లంచం ఇస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.