రామగిరి, అక్టోబర్ 08 : తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (TRTF) మాడ్గులపల్లి మండల శాఖ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్.కరుణాకర్, కొమరాజు జగన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నిమ్మనగోటి జనార్ధన్, తరాల పరమేశ్ యాదవ్ తెలిపారు. బుధవారం టీఆర్టీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన మాడ్గులపల్లి మండల శాఖ సమావేశంలో వారికి నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డిసెంబర్లో హైదరాబాద్ లో జరుగనున్న టీఆర్టీఎఫ్ 80 వసంతాల విద్యా సదస్సులో జిల్లా నుండి అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. 80 వసంతాల విద్యా సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ సలహాదారులు తంతెనపల్లి సైదులు, జిల్లా గౌరవాధ్యక్షుడు నంద్యాల మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు దొడ్డేని సాయిబాబు, బెజవాడ సూర్యనారాయణ, జిల్లా కార్యదర్శి నాళ్ల వెంకటేశ్వర్లు, కట్టంగూర్ మండల అధ్యక్షుడు చిట్టబోయిన లింగయ్య, నార్కెట్పల్లి మండల అధ్యక్షుడు కె.శేషగిరి, నల్లగొండ మండల అధ్యక్షుడు వడ్లకొండ సోమనర్సయ్య, దగ్గు రవి, మాండ్ర శివప్రసాద్ పాల్గొన్నారు.