గుర్రంపోడు: టీఆర్ఎస్తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవారం మం డలంలోని మొసంగి గ్రామంలో రూ.15 లక్షలతో నిర్మించనున్న మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్‌కు శంకు స్థాపన చేశారు. నియోజకవర్గ అభి వృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గాలి రవి కుమార్, సర్పంచ్‌లు రావులపాటి భాస్కర్, ఎన్నమల కృష్ణప్రసాద్, ఆర్‌డబ్లూఎస్ డీఈ నగేశ్, టీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు అభినయ్ యాదవ్ పాల్గొన్నారు.
పెద్దవూర: పెద్దవూర మండలం వెల్మగూడెం, పులిచర్ల గ్రామాల్లో ఎమ్మెల్యే నోముల భగత్ బుధవారం సూమరు 30 లక్షల విలువైన రెండు ఓవర్ హెడ్ ట్యాంకులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ వివేక్‌రావు, సర్పంచ్‌లు రావుల శ్రీను, దాసరి సైదమ్మ, నాయకులు కర్ణ బ్రహ్మరెడ్డి, రవినాయక్, సైదులు యాదవ్, ఆడెపు రామలిగయ్య, బణాల శ్రీనువాస్, నడ్డి రామంజనేయులు ,ఎంపీడీవో దుబ్బ శ్యామ్ పాల్గొన్నారు.