పీఎం శ్రీ ప్రధానోపాధ్యాయులకు బెంగళూరులో శిక్షణ
పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల వృత్తి నైపుణ్యాలు, సామర్థ్యాభివృద్ధిని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా బెంగళూరులోని ఇండియన్ సైన్స్ సెంటర్, మైసూరులోని ప్రాంతీయ విద్యా సంస్థలను...
– సైన్స్, సాంకేతిక పరిజ్ఞానం, ఆంగ్ల భాషా బోధనపై అధ్యయనం
– 43 మంది ప్రధానోపాధ్యాయులతో అధ్యయన యాత్ర ప్రారంభం
రామగిరి, అక్టోబర్ 29 : పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల వృత్తి నైపుణ్యాలు, సామర్థ్యాభివృద్ధిని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా బెంగళూరులోని ఇండియన్ సైన్స్ సెంటర్, మైసూరులోని ప్రాంతీయ విద్యా సంస్థలను సందర్శించేందుకు 43 మంది ప్రధానోపాధ్యాయులు బయల్దేరారు. జిల్లా విద్యాధికారి కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ రామాచారి, ఎఫ్ఏఓ బాలాజీ నాయక్ జెండా ఊపి బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రామాచారి మాట్లాడుతూ, నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆంగ్ల భాషా బోధన, ఆధునిక విద్యా విధానాలు తదితర అంశాలపై ప్రధానోపాధ్యాయులు అధ్యయనం చేస్తారని తెలిపారు.

పీఎం శ్రీ ప్రధానోపాధ్యాయులకు బెంగళూరులో శిక్షణ
శిక్షణ ద్వారా పొందిన విజ్ఞానాన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులకు వివరించి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలని సూచించారు. పీఎం శ్రీ పాఠశాలల్లో విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే అనేక వినూత్న కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. నూతన బోధనా పద్ధతులు, శాస్త్రీయ దృక్పథం, నైపుణ్యాధారిత విద్య ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ఈ శిక్షణ ప్రధాన లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్లు శ్రీనివాస్ గౌడ్, శ్రీనయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పీఎం శ్రీ ప్రధానోపాధ్యాయులకు బెంగళూరులో శిక్షణ
ఎంజీయూలో వినూత్న కార్యక్రమం.. ‘ఎర్న్ వైల్ యు లెర్న్’
ACB Net | రెవెన్యూ రికార్డులో పేరును సరిదిద్దేందుకు లంచం డిమాండ్..ఏసీబీకి చిక్కిన జీపీవో
Supreme Court: చదువుకున్నవాళ్లు డిజిటల్ అరెస్టు ఎలా అవుతున్నారు.. సుప్రీంకోర్టు షాక్
కాంగ్రెస్ సర్కార్‌కు గ్రాడ్యూయేట్లు బుద్ధి చెప్పాలి : తక్కెళ్లపల్లి రవీందర్ రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

