కనగల్, ఆగస్టు 22 : కనగల్ మండలం నరసింహపురం గ్రామంలోని సెరికల్చర్ రిసోర్స్ సెంటర్లో 70 మంది రైతులకు శనివారం సెరికల్చర్పై శిక్షణ, అవగాహన కల్పించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమంను రిసోర్స్ పర్సన్ జెల్లా పుండరీకమ్ నిర్వహిచారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డివిజన్ లోని నల్లగొండ, కనగల్, తిప్పర్తి మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ జగాల్ రెడ్డి, ఏడీఏ గిరి, కనగల్ ఏఓ అమరేందర్ గౌడ్, హార్టికల్చర్ ఆఫీసర్ అనంత రెడ్డి, సెరికల్చర్ ఏడీ నర్సిరెడ్డి, లింగోటం, చెట్ల చెన్నారం, తుర్కపల్లి సర్పంచులు, వ్యవసాయ శాఖ హార్టికల్చర్, సెరికల్చర్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.