చండూరు : నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ పరిధిలోని గాంధీజీ విద్యాసంస్థలో ఆదివారం ఉచిత మెగా క్యాన్సర్ ( Cancer ) శిబిరాన్ని నిర్వహించారు. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ సౌజన్యంతో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు సహకారంతో నిర్వహించిన శిబిరానికి చండూరు వాస్తవ్యులు క్యాన్సర్ నిపుణులు, డాక్టర్ చిలుకూరి రామకృష్ణ ప్రసాద్ , డాక్టర్ శిరీష హాజరై 150 మందికి పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ చిలుకూరి రామకృష్ణ ప్రసాద్ ( Chilukuri Ramakrishna Prasad ) మాట్లాడుతూ పొగాకు క్యాన్సర్‌కు కారకమని, పొగాకు వల్ల నోటి క్యాన్సర్ వస్తుందని వివరించారు. క్యాన్సర్‌ను మొదటి దశలో గుర్తిస్తే భయపడవలసిన అవసరం లేదని, చికిత్స ద్వారా నయం చేయవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్టార్ హాస్పిటల్స్ మేనేజర్ సుమన్, కోడి గిరిబాబు, కోడి వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ్, కౌన్సిలర్లు బుషిపాక వాసు, కటకం రమేష్, తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్, కొండ్రెడ్డి మధు, సీపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు రాపోలు ప్రభాకర్, కర్నాటి శీను, చిలుకూరి అశోక్, గజ్జల కృష్ణారెడ్డి, సరికొండ వెంకన్న, నెల్లూరి శ్రీనివాసులు, పున్న సైదులు, పున్న ధర్మేందర్, తదితరులు పాల్గొన్నారు.