నకిరేకల్, మే 27 : ఈ నెల 31న హైదరాబాద్‌లోని జలవిహార్‌లో నిర్వహించనున్న తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (H-143) రజతోత్సవ వాల్ పోస్టర్‌ను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నార్కట్‌పల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నూతన కార్యవర్గాన్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో TUWJ(H-143) ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నకిరేకల్ నియోజకవర్గ నూతన అధ్యక్షుడు కొమ్ము గిరి, ప్రధాన కార్యదర్శి శిరస్సు రమేశ్, గౌరవ సలహాదారు వడ్లకొండ రామ సాయిలు, ఉపాధ్యక్షుడు డేగటి శీను, కార్యదర్శి గుండ్లపల్లి వెంకన్న, కొల్లు నరేశ్, కారంపూరి మధు, రహీమ్, చెన్నోజు చంద్రశేఖర్, రంగనాథ్, శంకర్ పాల్గొన్నారు.