మిర్యాలగూడ, డిసెంబర్11 : తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా తిప్పన విజయసింహారెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. అభినందనలు తెలిపిన వారిలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, యాదాద్రి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, నోముల భగత్,
బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి ఉన్నారు.
మిర్యాలగూడ, డిసెంబర్11 : ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా తిప్పన విజయసింహారెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తిప్పనకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అభినందనలు తెలిపారు.
పదవీ స్వీకార కార్యక్రమానికి ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, నోముల భగత్, బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్ హాజరై అభినందనలు తెలిపారు. అదేవిధంగా మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఆధ్వర్యంలో 250వాహనాల్లో 2 వేల మందికి పైగాపైగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తిప్పన పదవీ బాధ్యతల స్వీకారానికి తరలివెళ్లారు.