మిర్యాలగూడ, జూలై 4: లక్కి డ్రా పేరు తో మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతా ల ప్రజలను మోసం చేసిన ముగ్గురు ఘరానా మోసగాళ్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ శరత్‌చంద్రపవార్ తెలిపారు. శుక్రవారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శరత్‌చంద్రపవార్ వివరాలు వెల్లడించారు. మిర్యాలగూడలోని హౌసింగ్‌బో ర్డు కాలనీలో ఆర్కే ఎంటర్ప్రైజెస్ పేరుతో మల్టీలెవల్ సంస్థను స్థాపించి.. లక్కి డ్రా పేరుతో సభ్యులను చేర్పిస్తున్నారని తెలిపారు.
నెలకు రూ.వెయ్యి చొప్పు న 15 నెలలపాటు కడితే ప్రతినెలా డ్రాలో వచ్చిన పది మం దికి విలువైన వస్తువులు ఇస్తామని ఆశ చూపించారని తెలిపారు. 15 నెలల్లో డ్రాలో రాకున్నా కట్టిన మొ త్తానికి అంత విలువ చేసే వస్తువులు లేదా డబ్బులు ఇస్తామని ప్రచారం చేశారని తెలిపారు. కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని అమాయక ప్రజలను ఈ లక్కీ డ్రాలో చేర్పించారని తెలిపారు. మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాం తా ల్లో 2,143 మందిని స్కీంలో చేర్పించుకొని సుమారు రూ.1.85,79,000 వసూలు చేశారని తెలిపారు.
ప్రజలను నమ్మబలికించేందుకు రూ.50 లక్షలతో కొద్ది మందికి గిఫ్ట్‌లు అందించారని చెప్పారు. మిగిలిన సభ్యులకు స్కీం గడువు ముగిసినా డబ్బులు చెల్లించకపోవడం తో వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. సీఐ మోతీరాం ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేశారని చెప్పారు. శుక్రవారం హౌ సింగ్‌బోర్డు కాలనీ సమీపంలో బైక్‌పై వెళ్తున్న నిందితులు కొమ్ము రమేశ్, కొ మ్ము కోటేశ్వర్రావు, బచ్చలకూరి శ్రీనులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
వారి వద్ద నుంచి సుమారు రూ.70 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకొని కోర్టులో డిపాజిట్ చేసినట్లు తెలిపారు. ముగ్గురు నిందితులను కోర్టు లో రిమాండ్ చేసినట్లు తెలిపారు. ప్రజలు మల్టీలెవల్ లక్కీ డ్రా పేరిట ఏర్పాటయ్యే సంస్థల్లో సభ్యులుగా చేరి మోసపోవద్దని సూచించారు. కమీషన్లకు ఆకర్షితులు కావొద్దన్నారు. ఇలాంటి సంస్థల సమాచారం ఉంటే పోలీసులకు అందించాలని కోరారు. సమావేశంలో డీఎస్పీ రాజశేఖర్‌రాజు, సీఐ మోతీరాం, ఎస్ఐ సైదిరెడ్డి, సిబ్బంది శ్రీను, నర్సింహ, సైదులు, వీరబాబు, హమీదొద్దీన్ ఉన్నారు.