కట్టంగూర్, అక్టోబర్ 10 : విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడంతో పాటు పాఠశాల అభివృద్ధికి కస్తూరి ఫౌండేషన్ చూపిస్తున్న చొరవ అభినందనీయమని కట్టంగూర్ మండలంలోని ఎరసానిగూడెం ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం చింత యాదగిరి అన్నారు. శుక్రవారం పాఠశాలకు రూ.25 వేల విలువ చేసే సౌండ్ సిస్టమ్, విద్యార్థులకు జాతీయ నాయకుల చిత్రపటాలను కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ.. కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ సేవా మనస్సు, విద్య పట్ల ఉన్న నిబద్దత ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎంతో ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయలు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.