మద్యం దుకాణాలకు 15,266 దరఖాస్తులు
ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ముగిసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 82 మద్యం దుకాణాలకు 3,969 దరఖాస్తులు వచ్చాయి. దాంతో జిల్లాలో రూ 79.38 కోట్ల ఆదాయం సమకూరింది.
- ముగిసిన దరఖాస్తుల స్వీకరణ.. 21న కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా
- ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వానికి రూ.304.38 కోట్ల ఆదాయం
- గతం కంటే పెరిగిన దరఖాస్తులు
భువనగిరికలెక్టరేట్, ఆగస్టు 18 : ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ముగిసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 82 మద్యం దుకాణాలకు 3,969 దరఖాస్తులు వచ్చాయి. దాంతో జిల్లాలో రూ 79.38 కోట్ల ఆదాయం సమకూరింది. జిల్లాలో ఎక్సైజ్ స్టేషన్ల వారీగా పరిశీలిస్తే భువనగిరి పరిధిలో అత్యధికంగా 1,251 దరఖాస్తులు, అత్యల్పంగా మోత్కూరులో 651 దరఖాస్తులు దాఖలయ్యాయి. జిలాల్లోని నాలుగు ఎక్సైజ్ పోలీస్స్టేషన్ల పరిధుల్లో 1,379 దరఖాస్తులు రాగా గతేడాది పోలిస్తే దాదాపుగా మూడింతల దరఖాస్తుల అందాయి.
సూర్యాపేటలో 99 దుకాణాలు.. 4,250 దరఖాస్తులు
సూర్యాపేట సిటీ : సూర్యాపేట జిల్లాలో 99 మద్యం దుకాణాలకు 4,250 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ నెల 21న జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్హాల్లో డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయించనున్నారు. రూ. 85 కోట్ల ఆదాయం వచ్చింది.
నల్లగొండలో 7,047 దరఖాస్తులు
నీలగిరి : నల్లగొండ జిల్లాలో 155 దుకాణాలు ఉండగా 7,047 దరఖాస్తులు అందాయి. చివరి రోజు 2,508 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో 52 దుకాణాలకు రిజర్వేషన్లు కేటాయించగా 103 దుకాణాలు ఓపెన్ టెండర్లు నిర్వహించారు. ఈనెల 21న నల్లగొండలోని లక్ష్మి గార్డెన్లో కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా తీసి దుకాణాల కేటాయించను న్నారు. ప్రస్తుతం ఉన్న లైసెన్స్ దారుల గడువు నవంబర్ 30న ముగుస్తుంది. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలు కానుంది. దరఖాస్తుల రూపంలో ప్రభుత్వానికి రూ.140.94 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది 4,079 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

