నల్లగొండ, జులై 27: నల్లగొండ మండలం సూరారంలో పదేండ్ల కింద కొన్న భూమిపై అమ్మిన వ్యక్తి అడ్డం తిరిగాడు…ఆయనకు వత్తాసు పలికిన ఓ అధికార పార్టీ నేత అమ్మిన భూమిలో కొంత అయినా తిరిగి ఇవ్వు లేదా ఎంతోకొంత ధర కట్టివ్వమని డి మాండ్…ఇదే మండలం నర్సింగ్‌బట్లలో భూ పం చాయితీ ఉందని తెలిస్తే చాలు అక్కడికి వెళ్తు న్న ఓ అధికార పార్టీనేత ఎదుటి వారిని రెచ్చగొట్టి పంచాయితీలు పెట్టించి పోలీస్టేషన్లో తన హవా నడిపిస్తున్నాడు.
ఇక తిప్పర్తి మండలం తానేదారు పల్లిలో ఓ రైతుకు చెందిన పట్టాభూమిలో బాట పో యటంతో న్యాయం చేయమని పోలీస్టేషన్‌కు వెళ్తే నేను వాళ్లకు చెప్పలేను కానీ…వారికి తెలియకుండా రాత్రికి రాత్రే బాట చెడగొట్టమనే ఉచిత సలహా.. ఇ లా ఒక ఊరు కాదు..వార్డు కాదు..భూములకు వి లువ పెరగటంతో నల్లగొండ నియోజక వర్గంలో ఏ డాదికాలంగా భూ కబ్జాలు పెరిగిపోవడంతో పంచాయితీలు పోలీస్టేషన్లకు చేరుతున్నాయి. దాంతో ఆయా ప్రాంతాల్లోని పోలీస్టేషన్లల్లో ఖాకీలు, ఖద్దరు చొక్కాలు ధరించిన నేతలు అధికారం చలాయిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
బలహీన వర్గాలు…బీఆర్ఎస్ నేతలే టార్గెట్..
నల్లగొండ నియోజక వర్గంలో నల్లగొండ మండలంతో పాటు తిప్పర్తి, కనగల్, నల్లగొండ, మాడ్గులపల్లి మండలాలు ఉన్నాయి. రూరల్ ప్రాంతంలో 93 గ్రామ పంచాయితీలు ఉండగా నల్లగొండలో 48 వార్డులు ఉన్నాయి. ప్రధానంగా రూరల్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలతో పాటు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని దాడులు సాగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలు బలవంతులైతే కేసులు పెట్టి జైళ్లలో పెట్టడం…లేదా బలహీనులతో పాటు ఇతర పార్టీలకు చెందిన వారైతే అమ్మిన భూమిలో వాటా లేదంటే సెటిల్మెంట్లు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయంలో పోలీసులు ఖద్దరు చొక్కాలు వేసుకున్న నేతల్లా మాట్లాడుతూ అధికార పార్టీ నేతల కొమ్ము కాస్తూ కేసులు పెడతామని బెదిరిస్తున్న నేపథ్యంలో ఏదో ఒక దానికి రాజీపడాల్సి వస్తోందని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పదేండ్ల ధనదాహం తీర్చుకునే క్రమంలోనే…
2014 నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన భూముల లావాదేవీలపై దృష్టి సారించిన అధికార పార్టీ నేతలు ఆయా ప్రాంతాల్లో ఉన్న భూసమస్యలు వెలికి తీసి మరీ అమాయకుల దగ్గర నుంచి అందినకాడికి దోచుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. మంత్రి కోమటిరెడ్డి అండతో కింది స్థాయిలో ఉన్న అధికార పార్టీ నేతలు ఈ దందాకు తెరదీస్తుండగా ఖాకీలు మాత్రం చోద్యం చూస్తూ వారికి అండగా ఉండటంతో సామాన్యుల పరిస్థితి దయనీయంగా మారినట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా ఆదివారం వస్తే చాలు అదేదో పండగ చేసుకుంటున్నట్లు పంచాయితీలు నిర్వహించి మధ్యాహ్న సమయానికల్లా పూర్తి చేసి ఇరువర్గాల వద్ద ముడుపులు తీసుకొని ఇంటికి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో గెట్టు పంచాయితీలు, పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్ పంచాయితీలు పెద్ద ఎత్తున స్టేషన్లకు వస్తున్నాయి.