నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన బోడంగిపర్తి ప్రజలు
బోడంగిపర్తి గ్రామానికి చెందినగ్రామశాఖ బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు, గ్రామపంచాయతీ 7 వార్డు మెంబర్ రేవెల్లి నరేష్ అనారోగ్య కారణంతో అకాల మరణం చెందారు.
చండూరు ఆగస్టు 23 : ఇటీవల అనారోగ్య కారణాలవల్ల మృతి చెందిన నల్లగొండ జిల్లా చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందినగ్రామశాఖ బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు, గ్రామపంచాయతీ 7 వార్డు మెంబర్ రేవెల్లి నరేష్ అనారోగ్య కారణంతో అకాల మరణం చెందారు. నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి కుటుంబానికి పార్టీలు, కులమతాలకు అతీతంగా బోడంగిపర్తి గ్రామానికి చెందిన ప్రజలు ఎవరికీ తోచినంత తమ వంతుగా ఆర్థిక సహాయం చేశారు. గ్రామ ప్రజల సాయంతో వచ్చిన 1,15,500 రూపాయలను రేవెల్లి నరేష్ కుటుంబానికి గ్రామ ప్రజలు అందజేశారు.
పార్టీలకు అతీతంగా అండగా నిలిచిన బోడంగిపర్తి గ్రామ ప్రజల అందరికీ పేరుపేరునా నరేష్ కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కట్కూరి సత్తయ్య, వట్టికోటి శ్రీనివాస్, వరకాల శ్రవణ్, వర్కాల శంకరయ్య, కడారి నరసింహ, కట్కూరి నరసింహ, దోటి ఆంజనేయులు, కందికట్టె సైదులు, ఎండీ అఫ్జల్, వర్కాల అంబేద్కర్, బొమ్మరబోయిన వెంకట్, ఎండీ రాషద్, కుటుంబ సభ్యులు రేవల్లి శ్రీను రేవెల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

