ఆలేరు టౌన్, మార్చి 7: ఆలేరు ప్రజలకు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని బీఆర్ఎస్ నాయకులు కొలుపుల హరినాథ్ వేడుకున్నారు. ఆలేరు పట్టణ కేంద్రంలోని కనకదుర్గ ఆలయంలో అమ్మవారి పర్వదినం సందర్భంగా పూజ అనంతరం శుక్రవారం అన్న వితరణలో భాగంగా ఆయన మాట్లాడారు.
విజయవాడ కనకదుర్గ దేవికి ఎంతైతే శక్తి ఉందో, ఆలేరు కనకదుర్గ అమ్మవారి కూడా అదే శక్తి ఉందని కొలుపుల హరినాథ్ తెలిపారు. ప్రతి శుక్రవారం భక్తులకు అన్నవితరణ చేయడం జరుగుతుందని చెప్పారు. ఆలయ కమిటీ సభ్యునిగా భక్తులకు అనేక సౌకర్యాలు అందజేస్తామని పేర్కొన్నారు. ఆలయ అభ్యున్నతి కోసం ఆలేరు ప్రజలందరూ తమ సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బేటి రాములు, మొరిగాడి వెంకటేష్, సముద్రాల కుమార్, సముద్రాల సత్యనారాయణ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.