ఆలేరు రూరల్ , మే 20 : శ్రమ విలువ తెలిసిన వ్యక్తి చిలుకు స్వామి అని ప్రభుత్వ మాజీ విప్, గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం శారాజీపేటలో ఏర్పాటు చేసిన చిలుకు స్వామి అభినందన సభలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మే డే సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన శ్రమ శక్తి అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో శారాజీపేటకు చెందిన చిలుకు స్వామికి అవార్డు దక్కడం గ్రామానికే కాకుండా యావత్ తెలంగాణకే గర్వకారణమన్నారు. స్వామికి శ్రమశక్తి అవా ర్డు దక్కడం వెనుక ఆయన భార్య నిరోష కృషి ఎంతో ఉందన్నారు.
ఉస్మానియా యూనివర్సిటిలో పీహెచ్డీ పట్టా పొంది సౌత్ సెంట్రల్ రైల్వేలోని ఇంజినీరింగ్ డిపార్ట్మెంటులో ఉద్యోగం సంపాదించి 14 సంవత్సరాలుగా పని చేస్తూ సికింద్రాబాద్ డివిజనల్ అసిస్టెంట్‌గా, ప్రెసిండెంట్‌గా 42వేల మంది కార్మికులకు సేవలందిస్తూ సొంతంగా చిలుకు ఫౌండేషన్ ద్వారా గ్రామాభివృద్ధికి ఎన్నో సేవలందించి పేదలకు స్వామి బాసటగా నిలిచారాన్నారు. గ్రామంలో నిరుపేద విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తూ, క్రీడలను ప్రోత్సహించడం అభినందననీయమన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు గంగుల శ్రీనివాస్ యాదవ్, పుట్టమల్లేశం గౌడ్, మండల సెక్రటరీ జనరల్ రచ్చ రామ నర్సయ్య, మాజీ ఉప సర్పంచ్ కంతి మహేందర్, పీఏసీఎస్ చైర్మన్ మొగులుగాని మల్లేశం గౌడ్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, పోరెడ్డి శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు జూకుంటి అనిల్, బేదరబోయిన యాకమ్మ, వడ్ల శోభన్‌బాబు, మొగులగాని నర్సింహలు, బీఆర్ఎస్ నాయకులు బెంజారం రవి, మాదాని ఫీల్ఫీస్, చిరమైన వెంకటేశ్, బండ మహేందర్‌రెడ్డి, జన గాం వెంకట్ పాపిరెడ్డి,దూడల శ్రీధర్, ఎస్సీ ఆర్ఎంయూ నాయకులు పాల్గొన్నారు.