మీకు ఓటర్ స్లిప్ అందలేదా.! ఇలా పొందండి
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం ఇప్పటికే ఓటర్ స్లిప్‌లు పంపిణీ పూర్తి చేసింది. బూత్ లెవెల్ అధికారులు(బీఎల్ఓ) ప్రతి ఇంటికీ వెళ్లి స్లిప్‌లను అందజేశారు.
- ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు
- హెల్ప్ లైన్ యాప్ నుంచి పొందవచ్చు
- టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు
- మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా వివరాలు
నీలగిరి నవంబర్ 29: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం ఇప్పటికే ఓటర్ స్లిప్‌లు పంపిణీ పూర్తి చేసింది. బూత్ లెవెల్ అధికారులు(బీఎల్ఓ) ప్రతి ఇంటికీ వెళ్లి స్లిప్‌లను అందజేశారు. చాలా మంది స్థానికంగా ఉండకపోవడం, ఇండ్లు ఖాళీ చేయడం, ఉద్యోగాల రీత్యా వేరే ప్రాంతాలకు వెళ్లడం, ఇతర కారణాలతో ఓటర్ స్లిప్‌లు అందక పోవడంతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓటర్ స్లిప్‌లు సంబంధించి బీఎల్ఓ మొబైల్ నంబర్ తెలిస్తే ఫోన్ చేసి వారి నుంచి పొందే అవకాశం ఉంది.
అందకపోతే ఏం చేయాలి…
ఓటర్ స్లిప్‌లు ఎన్నికల సిబ్బంది నుంచి అందకపోతే ఆన్లైన్ ద్వారా మొబైల్ యాప్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా పొందడానికి ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. ఫిజికల్ లేదా డిజిటల్ స్లిప్ లేకపోయినా నేరుగా పోలింగ్ బూత్‌కి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అదే పోలింగ్ కేంద్రంలో పేరు ఉంటే గుర్తింపు కార్డును చూపి ఓటు వేయవచ్చు. లేదంటే ఈ పద్ధతిలో ఓటర్ స్లిప్‌ను లేదా వివరాలు పొందే వెసులుబాటు ఉంది.
ఒక మెసేజ్ తో….
ఓటర్ గుర్తింపు కార్డు నంబర్‌ను టైప్ చేసి 1950 లేదా 9211728082 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపితే వివరాలు వస్తాయి. అన్లైన్లో అయితే www.ceo.telangana.nic.in వెబ్ సైట్లో సెర్చ్ యువర్ నేమ్ అసెంబ్లీ ఓటర్ సర్వీస్ పోర్టల్ లేదా మెనూ ద్వారా ఓటర్ గుర్తింపు కార్డు లేదా మొబైల్ నంబర్ లేదా పేరును ఇవ్వడం ద్వారా ఏ నంబర్ పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయవచ్చు. అంతేకాకు డిజిటల్ స్లిప్ ను కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. www.electoral search.eci.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఇవే వివరాలను పొందుపరిచి డిజిటల్ ఓటర్ స్లిప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇలా కూడా పొందవచ్చు..
www.voters.eci.gov.in వెబ్సైట్లో సెర్చ్ ఇన్ ఎలక్ట్రోరల్ రోల్ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసి వ్యక్తుల వివరాలను పొందుపర్చడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. www.ceo. telangana.nic.in అనే వైబ్సైట్లో ఆఫీసర్స్ డీటెయిల్స్- బూత్ లెవెల్ ఆఫీసర్ డిటెయిల్స్ అనే ఆప్షన్ ద్వారా జిల్లా, నియోజకవర్గం అకడి పోలింగ్ కేంద్రాల వారిగా బీఎల్ఓల ఫోన్ నంబర్ తెలుసుకొని వారికి ఫోన్ చేసి బూత్ నంబర్ వివరాలను పొందవచ్చు. లేదా www.ecotserm2.telangana.gov.in/ TS_ERO DETAILS/ BLO_ Details.aspx అనే వెబ్సైట్ ద్వారా కూడా జిల్లా, నియోజకవర్గం వివరాలను పొందుపర్చి బీఎల్ఓల ఫోన్ నంబర్లు తెలుసుకోవచ్చు.
మెయిల్ ద్వారా…
ఎన్నికల సంఘానికి మెయిల్(complainst@eci.gov.in) ద్వారా కూడా మన గ్రీవెన్స్ (ఫిర్యాదు)ను ఇచ్చి పోలింగ్ బూత్ వివరాలను తిరిగి మెయిల్ ద్వారానే పొందవచ్చు.
మ్బైల్ యాప్‌తో..
ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఐఓఎస్ వినియోగదారులు యాప్ స్టోర్ నుంచి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అనే ఆప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని వివరాలను ఇవ్వడం ద్వారా ఏ నెంబర్ పోలింగ్ బూత్ లో ఓటు వేయవచ్చు తెలుసుకోవచ్చు.
టోల్ ఫ్రీ నంబర్ ద్వారా…
కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో 24 గంటలు పని చేసే హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1950 కి ఫోన్ చేసి ఓటర్ల వివరాలను లేదా ఓటల్ గుర్తింపు కార్డు నంబర్‌ను తెలియజేయడం ద్వారా పోలింగ్ కేంద్రం బూతు లెవెల్ నంబర్ అధికారి(బీఎల్ఓ) నంబర్ తదితరులు పొందవచ్చు.
ఓటర్లు పాటించాల్సి నిబంధనలు
నీలగిరి, నవంబర్ 29 : శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఓటర్లు, సాధారణ ప్రజలు కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలు
- ఓటర్లు ఓటు వేయడానికి ఓటర్ గుర్తింపు కార్డు లేదా బీఎల్ఓ ఇచ్చిన ఫొటో స్లిప్ తీసుకుని పోలింగ్‌బూత్‌కు వెళ్లి ఓటేయవచ్చు.
- ఓటు వేయడానికి ఓటర్ గుర్తింపు కార్డు లేదా ఫొటో స్లిప్ లేకపోతే ఇతర గుర్తింపు కార్డులు (ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఈజేఎస్ జాబ్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ఎంప్లాయ్ ఐడీ)తో ఓటు వేయవచ్చు.
- ప్రతి పోలింగ్‌బూత్‌లో ఓటర్ సహాయ కేంద్రం ఏర్పాటు చేసినందున ఓటర్ క్రమ సంఖ్య తెలుసుకుంటే వారు క్రమసంఖ్యను తెలియ జేస్తారు.
- గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకుని కేంద్రానికి వెళ్లి ఓటేయవచ్చు.
- పోలింగ్‌బూత్‌లో ఓటు వేయడానికి వెళ్లేప్పుడు మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, స్రైపెన్స్, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లవద్దు.
- ఈవీఎంలో ఓటేసే విధానాన్ని పోలింగ్‌బూత్‌లో ప్రకటించిన ఓటర్ గైడ్‌పై చూసుకుని ఓటేయాలి.
- ఈవీఎంలో ఓటు వేసే ముందు మీ బటన్‌ను సున్నితంగా నొక్కాలి.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

