కట్టంగూర్, మార్చి 17 : తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నియామక పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 581 సంక్షేమ వసతి గృహాల అధికారుల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను టీజీపీఎస్సీ సోమవారం వెల్లడించింది. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని పామనగుండ్ల గ్రామానికి చెందిన గుజ్జుల శంకర్ రెడ్డి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 300 మార్కులకు గాను 198.4 మార్కులు సాధించి ఉద్యోగం పొందాడు. శంకర్ రెడ్డి పది సంవత్సరాలుగా నల్లగొండలోని పలు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఫిజిక్స్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు.
నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం నాయనవానికుంట గ్రామానికి చెందిన కొట్టే నరసింహ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో, యాదాద్రి జోన్లో ఐదవ ర్యాంకు సాధించాడు. నరసింహ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే సాగింది. తన విజయానికి సహకరించిన తల్లి మల్లమ్మ, స్నేహితులకు ఎంతో రుణపడి ఉంటానని తెలిపాడు.
HWO Results : పామనగుండ్ల, నాయనవానికుంట వాసులకు హాస్టల్ వెల్ఫేర్ వార్డెన్ ఉద్యోగాలు