తుంగతుర్తి, డిసెంబర్ 31 : తుంగతుర్తి మండల కేంద్రంలోని స్థానిక మండల విద్యా వనరుల కేంద్రం ఆవరణలో ఉప కోశాధికారి బోడ లక్ష్మి చేతుల మీదుగా టీఎస్ యూటీఎఫ్ 2026 సంవత్సర డైరీ, కాలమానినీ, అధ్యాపకదర్శిని, వాల్ స్టిక్కర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఉపాధ్యాయులందరూ కృషి చేయాలన్నారు. జిల్లా కార్యదర్శి మల్లెపాక రవీందర్ మాట్లాడుతూ.. డైరీలో ఉపాధ్యాయ సర్వీసు నిబంధనలు, ప్రభుత్వ జీఓల గురించి, హ్యాండ్‌బుక్‌లో వివరణాత్మక విద్యా సంబంధిత పూర్తి సమాచారం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు ఓరుగంటి అంతయ్య, జోగునూరి దేవరాజ్, మండల ఉపాధ్యక్షుడు భీవనపల్లి శ్రీనివాస్, కోశాధికారి పాలవెల్లి ప్రేమయ్య, కార్యదర్శులు గొడిశాల శాంత, జీడి అనిల్ కుమార్, బరిగల నవీన్ కుమార్, కొమ్ము గణేష్, కల్లట్లపల్లి ఉప్పలయ్య, ఎండీ హబీబ్, ఆడిట్ కమిటీ సభ్యులు వయ్య సురేశ్, రిటైర్డ్ ఉపాధ్యాయులు పాలకుర్తి ఎల్లయ్య, కుంచం సుందరయ్య, పులి వీరభద్రయ్య, గుండెపురి విజయ్, ధరావత్ బాలాజీ, గుగులోతు దేవా పాల్గొన్నారు.