రామగిరి, మే 10 : తెలంగాణ వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఐసెట్ -2025 ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువును ఈ నెల 15వరకు పెంచినట్లు సెట్ కన్వీనర్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని, అర్హులైన విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.