విస్తరణ సరే.. పరిహారం ఎంత!
ఎంఎంటీఎస్ విస్తరణ కోసం బీబీనగర్ పట్టణ పరిధిలోని ఇండ్లు, నివాస ప్లాట్లు కోల్పోతున్న బాధితుల్లో టెన్షన్ మొదలైంది. తమ ఆస్తులకు ఎంత పరిహారం చెల్లిస్తారనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించకుండా సర్వేలు చేపడుతుండటంపై స్థానికుల్లో ఆం దోళన నెలకొంది. దీంతో వారు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, మారెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
- మారెట్ రేట్ చెల్లించాలని నిర్వాసితుల డిమాండ్
- ఎంఎంటీఎస్ విస్తరణతో భూములు కోల్పోతున్న నిర్వాసితుల్లో టెన్షన్
- పరిహారంపై సరార్ నుంచి నో క్లారిటీ
- ఇప్పటికే భూముల్లో అధికారుల సర్వేలు
- ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ నిత్యం ప్రదక్షిణలు
బీబీనగర్, జూన్ 15 : ఎంఎంటీఎస్ విస్తరణ కోసం బీబీనగర్ పట్టణ పరిధిలోని ఇండ్లు, నివాస ప్లాట్లు కోల్పోతున్న బాధితుల్లో టెన్షన్ మొదలైంది. తమ ఆస్తులకు ఎంత పరిహారం చెల్లిస్తారనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించకుండా సర్వేలు చేపడుతుండటంపై స్థానికుల్లో ఆం దోళన నెలకొంది. దీంతో వారు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, మారెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
పరిహారంపై సందిగ్ధం
ఎంఎంటీఎస్-2 ప్రాజెక్టును రాయగిరి వరకు విస్తరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా ప్రత్యేకంగా రైల్వే ట్రాక్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే బీబీనగర్‌లో కొం దరు భూములు, ప్లాట్లు కోల్పోవాల్సి వస్తున్నది. ఇప్పటికే అధికారులు సర్వేలు నిర్వహించి వివరాలు సేకరించినప్పటికీ, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని స్థానికులు చెబుతున్నారు. ప్రజాప్రయోజనాల కోసం చేపట్టే పనులకు తమకు అభ్యంతరం లేదని, అయితే మొత్తం ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని కోరుతున్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ చకెర్లు
ఎంఎంటీఎస్ విస్తరణతో అభివృద్ధి, రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నప్పటికీ, ఆస్తులు కోల్పోతున్న కుటుంబాల్లో భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. బాధితులు ఇప్పటికే ఎమ్మెల్యే కుంభం కుమార్ రెడ్డి, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్, ఆర్డీవోను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఆస్తులు కోల్పోతున్న తమకు తగిన పరిహారం అందజేయాలని కోరుతున్నారు. అయితే ఇప్పటి వరకు పరిహారం, పునరావాస అంశాలపై స్పష్టత రాలేదని ఆరోపిస్తున్నారు.
మారెట్‌కు అనుగుణంగా పరిహారం..
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం భూముల మారెట్ విలువను సవరించింది. ఎంఎంటీఎస్ విస్తరణ కోసం అధికారులు సర్వే చేపట్టిన సమయంలో ఈ ప్రాంతంలో గజం విలువ సుమారు రూ.2,100 ఉండగా, ప్రస్తుతం సవరించిన మారెట్ విలువ ప్రకారం గజం ధర రూ.3,200కు చేరింది. అయితే వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. బీబీనగర్ పరిసర ప్రాం తాల్లో గజం ధర రూ.20 వేల కంటే తకువ లేదని, ఎంఎంటీఎస్ ప్రాజెక్టు కారణం గా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో గజం ధర రూ.25 వేల వరకు పలుకుతోందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయించే పరిహారం, వాస్తవ ధరకు ఏమాత్రం పొంతనలేదని బాధితుల్లో ఆందోళన ఉంది. వాస్తవ ధరను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పరిహారం వివరాలు వెల్లడించాలి..
మా కుటుంబం చాలా ఏండ్లుగా ఈ ప్రాంతంలో నివసిస్తోంది. ఇప్పుడు ఎంఎంటీఎస్ విస్తరణలో మా ఇల్లు పోతుందని అధికారులు చెబుతున్నారు. కానీ ఎంత పరిహారం ఇస్తారు.. ఎప్పుడు చెల్లిస్తారు.. ప్రత్యామ్నాయం ఏమైనా చూపుతారా అనే విషయమైపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను పలుమార్లు కలిసి వినతిపత్రాలు అందజేశాం. అయినప్పటికీ బాధితులకు పూర్తి సమాచారం అందడం లేదు. అభివృద్ధి పనులకు మేము వ్యతిరేకం కాదు. కానీ కష్టపడి నిర్మించుకున్న ఇంటిని కోల్పోతున్నందున ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందించి ఆదుకోవాలి.
-కైర పోచమ్మ, బీబీనగర్
బహిరంగ మారెట్ ఆధారంగా న్యాయం చేయాలి
మా ప్లాటు ప్రాజెక్టు పరిధిలోకి వచ్చిందని అధికారులు సర్వే నిర్వహించారు. కానీ పరిహారం ఎంత ఇస్తారు.. ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు అనే దానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం బీబీనగర్ పరిసర ప్రాంతాల్లో గజం ధర రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంది. ఎంఎంటీఎస్ ప్రాజెక్టు రావడంతో భూముల విలువ మరింత పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే పరిహారం మారెట్లో ఉన్న వాస్తవ ధరలకు సరిపోదు. బహిరంగ మారెట్లో ఉన్న వాస్తవ ధరను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం న్యాయం చేయాలి.
-పాశం బాలయ్య, బీబీనగర్
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

