మర్రిగూడ, సెప్టెంబర్ 22 : మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోటీ అని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మునుగోడు ప్రజలు గెలిచినట్టేనని పేర్కొన్నారు. మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ 10 కుటుంబాలు గురువారం చండూరులో కూసుకుంట్ల సమక్షంలో టీఆర్ఎస్లో చేరాయి. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీతోనే మునుగోడు అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రహించిన ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లోకి వస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి వెంకటయ్యగౌడ్, నాయకులు అంజయ్య, మల్లయ్య, శ్రీశైలం, నరేందర్ పాల్గొన్నారు.
సర్వేల్ గ్రామంలో 15మంది..
సంస్థాన్ నారాయణపురం : మండలంలోని సర్వేల్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు 15మంది మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో సర్పంచ్ కట్టెల భిక్షపతి, నాయకులు నలపరాజు రమేశ్, వీరమళ్ల జంగయ్య, కట్టెల మల్లేశ్ పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని అల్లందేవిచెరువు గ్రామానికి చెందిన బీజేపీ గ్రామ శాఖ మాజీ ఉపాధ్యక్షుడు సుర్వి లింగస్వామి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.