తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్
శాలిగౌరారం, జూన్ 5 : అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలో తెలంగాణే నంబర్ వన్ అని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మండలంలోని శాలిలింగోటం, అంబారిపేట గ్రామాల్లో ఎమ్మెల్యే నిధులు రూ.40 లక్షలతో నిర్మిస్తున్న రోడ్లకు ఆదివారం ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు సీఎం కేసీఆర్ దృఢసంకల్పంతో ఉన్నారన్నారు. ఎంపీపీ గంట లక్ష్మమ్మ, జడ్పీటీసీ ఎర్ర రణీలాయాదగిరి, వైస్ ఎంపీపీ కందుల అనిత, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కట్టా లక్ష్మీవెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ తాళ్లూరి మురళి, సర్పంచులు పాక మౌనికాయాదయ్య, బీరం శోభానర్సిరెడ్డి, ఎంపీటీసీ పాక రాములు, రైతు బంధు సమితి మండల కన్వీనర్ గుండా శ్రీనివాస్, ఎంపీపీ సలహాదారుడు గంట శంకర్, వైస్ చైర్మన్ గుజిలాల్ శేఖర్‌బాబు పాల్గొన్నారు.
వైభవంగా గంగదేవమ్మ, కంఠమహేశ్వరస్వామి కల్యాణాలు
మండలంలోని బైరవునిబండ గ్రామంలో యాదవుల ఆరాధ్య దైవం గంగదేవమ్మ, మాదారంలో కంఠమహేశ్వరస్వామి, సురమాంబదేవి కల్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ హాజరై పూజలు చేశారు. అనంతరం కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఎంపీటీసీ కొత్త శంకర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కటికం సత్తయ్యగౌడ్, మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్, నాయకులు మామిడి సర్వయ్య, జెర్రిపోతుల చంద్రమౌళిగౌడ్, గంట శంకర్, టీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు కల్లూరి నాగరాజుగౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏమిరెడ్డి నర్సిరెడ్డి, ఈదులకంటి యాదయ్య, సంకటి రమేశ్, కడారి మల్లయ్య పాల్గొన్నారు.