Golden Boot: గోల్డెన్ బూట్ రేసులో మెస్సీ లీడింగ్
Golden Boot: గోల్డెన్ బూట్ రేసులో మెస్సీ ముందుకొచ్చేశాడు. 8 గోల్స్, 4 అసిస్ట్‌లతో ఆ అవార్డు రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే ఫ్రాన్స్ ప్లేయర్ ఎంబాపే ఖాతాలోనూ 8 గోల్స్ ఉన్నాయి. కానీ అతనికి 2 అసిస్ట్‌లు మాత్రమే ఉన్నాయి. ఇక ఫైనల్, బ్రాంజ్ మ్యాచ్ ఆధారంగా ఆ అవార్డు ఎవర్ని వరిస్తుందో తేలనున్నది.
న్యూయార్క్: అర్జెంటీనా స్టార్ ప్లేయర్ ఫిఫా వరల్డ్‌కప్‌లో తన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా పేరుగాంచిన మెస్సీ తన మ్యాజిక్ గేమ్‌తో ప్రత్యర్థులను చిత్తు చేస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లోనూ మెస్సీ తన ట్యాలెంట్ ప్రదర్శించారు. రెండు అసిస్ట్‌లు ఇచ్చి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే వరల్డ్‌కప్ టోర్నీలో ఇచ్చే గోల్డెన్ బూట్(Golden Boot) అవార్డు రేసులో ప్రస్తుతం అర్జెంటీనా ప్లేయర్ లియోనల్ మెస్సీ ముందున్నారు. మెస్సీ ఖాతాలో 8 గోల్స్, 4 అసిస్ట్‌లు ఉన్నాయి. దీంతో అతను అడిడాస్ గోల్డెన్ బూట్ అవార్డు రేసులో దూసుకెళ్లుతున్నాడు.
అయితే ఫ్రాన్స్‌ను సెమీస్ వరకు తీసుకెళ్లిన ఆ జట్టు కెప్టెన్ కైలియన్ ఎంబాపే కూడా మెస్సీ వెనుకే దూసుకొస్తున్నాడు. ఎంబాపే ఖాతాలో 8 గోల్స్ , మూడు అసిస్ట్‌లు ఉన్నాయి. గోల్డెన్ బూట్ కోసం రెండో స్థానంలో ఎంబాపే ఉన్నాడు. నార్వేకు చెందిన ఎర్లింగ్ హాలాండ్, ఇంగ్లండ్ ప్లేయర్ జూడ్ బెల్లింగ్‌హామ్.. కేన్, ఫ్రాన్స్ ప్లేయర్ డెంబ్లే, స్పెయిన్ ప్లేయర్ ఒయర్జెబల్ తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లండ్‌పై ఊహించని రీతిలో కోలుకుని అర్జెంటీనా విక్టరీ నమోదు చేయడంతో గోల్డెన్ బూట్ రేసులో ముందు వరసలోకి వచ్చేశాడు. వాస్తవానికి ఎంబాపే, మెస్సీ మధ్య గోల్స్ సంఖ్య సమంగా ఉన్నా.. అసిస్ట్‌ల సంఖ్యలో మెస్సీ ఆధిక్యంలో ఉన్నాడు. దీంతో గోల్డెన్ బూట్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇక మూడో స్థానం కోసం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో ఫ్రాన్స్ తలపడనున్నది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఎంబాపే గోల్స్ చేస్తే, అప్పుడు పరిస్థితి మారే అవకాశం ఉంటుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
‘బీఈడీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తప్పనిసరి’
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
Transfers | రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

