Lenin | ‘లెనిన్’ రూ.100 కోట్ల క్లబ్లో చేరడం ఖాయం.. సక్సెస్ మీట్లో నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
Lenin | అక్కినేని అఖిల్ కెరీర్లో అతిపెద్ద విజయంగా నిలిచిన 'లెనిన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో గుంటూరులో చిత్రబృందం ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా వసూళ్లు, ప్రేక్షకుల ఆదరణ, రూ.100 కోట్ల క్లబ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Lenin | అక్కినేని అఖిల్ కెరీర్లో అతిపెద్ద విజయంగా నిలిచిన ‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో గుంటూరులో చిత్రబృందం ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా వసూళ్లు, ప్రేక్షకుల ఆదరణ, రూ.100 కోట్ల క్లబ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సక్సెస్ మీట్లో మాట్లాడిన నాగవంశీ.. ‘లెనిన్’ విడుదలకు ముందే ఇది అఖిల్ కెరీర్లో తొలి రూ.100 కోట్ల గ్రాస్ సాధించే చిత్రంగా నిలుస్తుందని తాను బలంగా నమ్మానని తెలిపారు. అదే నమ్మకంతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని, ఇప్పుడు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ ఆ విశ్వాసాన్ని నిజం చేస్తోందని చెప్పారు.
మొదటి వారం సినిమా అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన వసూళ్లు సాధించిందని, ముఖ్యంగా మాస్ సెంటర్లతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా మంచి స్పందన రావడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ వారాంతంలో పెద్ద తెలుగు సినిమాలు విడుదల కావడం లేదని గుర్తుచేసిన నాగవంశీ.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రేక్షకులు కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్లకు వచ్చి ‘లెనిన్’ సినిమాను చూడాలని కోరారు.ఇప్పటికే సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇంకా చూడని వారు ఈ వీకెండ్లో తప్పకుండా థియేటర్‌కు వచ్చి సినిమా చూడండి. మీ అందరి ప్రేమ, ఆదరణతో ‘లెనిన్’ రూ.100 కోట్ల క్లబ్లో చేరుతుందనే పూర్తి నమ్మకం ఉంది” అని ఆయన అన్నారు.
సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి చాలా సంవత్సరాలు అయినప్పటికీ అఖిల్‌కు భారీ కమర్షియల్ సక్సెస్ కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూశారు. ఆ నిరీక్షణకు లెనిన్ తో ముగింపు పలికిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో అఖిల్ నటన, యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. సంగీత దర్శకుడు ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అఖిల్‌కు పూర్తి స్థాయి మాస్ ఇమేజ్ను తీసుకొచ్చిన చిత్రంగా ‘లెనిన్’ను అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే… ‘లెనిన్’ నిజంగానే రూ.100 కోట్ల క్లబ్లో చేరుతుందా? అన్న ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వసూళ్లే చెప్పనున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Akhil
- Box office
- collections
- Lenin
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

