దేవరకొండ రూరల్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను దేవరకొండ మండలం ఇదంపల్లిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, కేక్ కట్ చేశారు. ఇదంపల్లి గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసి 15 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా 15 కేజీల కేక్ కట్ చేశారు. జాతీయ పతాకాన్ని, బీఆర్ఎస్ పార్టీ జెండాను మాజీ ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, ఇదంపల్లి మాజీ సర్పంచ్ సరిత శ్రీనివాస్ రెడ్డి, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.
Devarakonda Rural : ఇదంపల్లిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు