మునుగోడు, సెప్టెంబర్ 04 : లయన్స్ క్లబ్ ఆఫ్ మునుగోడు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను గురువారం మునుగోడు జడ్పీహెచ్ఎస్, ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ లయన్ మిర్యాల వెంకటేశం, లయన్ నారబోయిన సుధాకర్, లయన్ మిర్యాల మధుకర్, లయన్ రావిరాల కుమారస్వామి, లయన్స్ క్లబ్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గౌరవ అతిథులు పాల్గొన్నారు.