రామగిరి, సెప్టెంబర్ 4 : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యాశాఖ బుధవారం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు విభాగాల్లో 71 మంది ఎంపిక చేయగా అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన 10 మంది ఉండడం విశేషం. వీరిలో ఒకరు మహాత్మాగాంధీ యూనివర్సిటీ, ఒక గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు, ఇద్దరు స్కూల్ అసిస్టెంట్స్, ఒక పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, సీనియర్ అధ్యాపకురాలు, ముగ్గురు డిగ్రీ కళాశాల అధ్యాపకులు, ఒక జూనియర్ కళాశాల అధ్యాపకులు ఉన్నారు. అవార్డుకు ఎంపికైన వారిలో నల్లగొండ జిల్లాలో ఆరుగురు, సూర్యాపేట జిల్లాలో ఒకరు, యాదాద్రి జిల్లాలో ఇద్దరు ఉన్నారు. వీరికి గురువారం హైదరాబాద్‌లో పురస్కారాలు అందజేయనున్నారు.
మహాత్మాగాంధీ యూనివర్సిటీలో
ఉన్నత విద్యలో(డిగ్రీ కళాశాలలు)..
ప్రభుత్వ పాలిటెక్నికల్‌లో..
ఆర్.యూ. శిల్ప, జూనియర్ అధ్యాపకురాలు, కెమిస్ట్రీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల, చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి జిల్లా పేద విద్యార్థుల సేవలో అనిల్‌కుమార్ పేదరికంలో ఉన్న ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే లక్ష్యంతో 2011 నుంచి అధ్యాపకుడిగా సేవలందిస్తూ వస్తున్నారు ఎం.అనిల్‌కుమార్. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం తొర్మామిడి గ్రామానికి చెందిన ఆయన నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో రసాయశాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలోని పెద్దదేవులపల్లిలోని రెడ్డిల్యాబ్‌లో తన పరిశోధనతోపాటు కెమిస్ట్రీ విద్యార్థులకు పరిశోధనపై అవగాహన కల్పించారు. తన సబ్జెక్టులో ఇప్పటి వరకు 10 ఇంటర్నేషనల్ జనరల్స్ ప్రచురించారు. మరో వైపు టి-శాట్(మన టీవీ)లో ఉన్నత విద్యామండలి ద్వారా పాఠాలను కూడా చెప్పారు.
మరింత బాధ్యత పెంచింది : బి.నీరజ, అధ్యాపకురాలు,
విద్యార్థులకు ఉత్తమ విద్య బోధన సేవలను గుర్తించి ప్రభుత్వం ఉత్తమ అవార్డుకు ఎంపిక చేయడం సంతోషంగా ఉంది. గతంలో మాసబ్‌ట్యాంక్ హైదరాబాద్‌లో సుదీర్ఘకాలం విద్యార్థులకు సేవలందించి ఇటీవల నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలకు వచ్చా. విద్యార్థులకు బోధన చేయడంతోపాటు ఉద్యోగ, ఉపాధి మార్గాలను తెల్పడమే లక్ష్యంగా ముందుకు సాగుతా.
ఉన్నత సేవల..మిర్యాల
నల్లగొండ పట్టణానికి చెందిన మిర్యాల రమేశ్‌కుమార్ ఎంజీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పరిశోధన పత్రాలు సమర్పించారు. ఎంజీయూలో పరీక్షల నియంత్రణాధికారిగా, ప్రిన్సిపాల్‌గా, హెచ్ఓడీగా, ఐక్యూఐసీ డైరెక్టర్‌గా, డైరెక్టర్ ఆప్ అడ్మిషన్స్, హాస్టల్స్ డైరెక్టర్‌గా ఆయన పారదర్శకమైన సేవలందించారు.
రెండు దశాబ్దాలుగా విద్యార్థుల సేవలో శ్రీధర్
రెండు దశాబ్దాలుగా విద్యార్థులకు బోధన అందిస్తున్నారు ఆర్.శ్రీధర్, హైదరాబాద్‌లోని సిటీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి ఇటీవల నల్లగొండ ఎన్జీ కళాశాలకు వచ్చారు. గతంలో ఎంజీయూలో అకాడమిక్ కన్సలెంట్‌గా పనిచేశారు. ఇప్పటి వరకు ఆయన జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో 26 పరిశోధన వ్యాసాలు రాశారు. విద్యార్థులకు ఉత్తమ బోధన అందిస్తూ కామర్స్ రంగంలో తీర్చిదిద్దారు.
బోధన, పరిశోధనలో మేటి తండు కృష్ణయ్య
ఉపాధ్యాయుడిగా, అధ్యాకుడిగా 30 సంవత్సరాల బోధనానుభవాన్ని కలిగి ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు తండు కృష్ణయ్య. మరో వైపు కవిగా, రచయితగా అనేక రచనలు చేసి సాహితీరంగంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. పలు పరిశోధన వ్యాసాలను రాశారు. కళాశాలలో విద్యార్థుల కోసం జాతీయ, రాష్ట్ర స్ధాయి సదస్సులను నిర్వహించారు. జూలై వరకు నల్లగొండ ఎన్జీ కళాశాల తెలుగు విభాగంలో పనిచేసి బదిలీల్లో భాగంగా ఇటీవల రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెళ్లారు.