నిడమనూరు, జూలై 30 : నిడమనూరు మండల కేంద్రంలోని భవిత కేంద్రాన్ని తాసీల్దార్ జంగాల కృష్ణయ్య బుధవారం పరిశీలించారు. ఇటీవల జరిగిన మరమ్మతు, ఆధునీకరణ పనులను పరిశీలించారు. బోధనాభ్యసన సామగ్రి, బోధనా తీరును పరిశీలించారు. విద్యార్థులకు బొమ్మలు చూపించి గుర్తించమని మానసిక దివ్యాంగులను ప్రశ్నించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట మండల విద్యాధికారి లావురి వెంకన్న, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గౌతమ్, ఐఈఆర్ టి జి.వెంకటేశ్వర్లు ఉన్నారు.