హైదరాబాద్, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్-జకార్తా నగరాల మధ్య సాంకేతిక నైపుణ్యాల మార్పిడి కోసం ప్రత్యేక కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం సుముఖంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇండోనేషియా డిజిటల్ పరివర్తన ప్రయాణంలో టెక్నాలజీ హబ్‌గా అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న తెలంగాణ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. గురువారం న్యూఢిల్లీ భారత్ మండపంలో నిర్వహిస్తున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో ఇండోనేషియా కమ్యూనికేషన్స్ అండ్ డిజిటల్ అఫైర్స్ వైస్ మినిస్టర్ నెజార్ పాత్రియా నేతృత్వంలోని అత్యున్నత స్థాయి బృందంతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ భేటీలో తెలంగాణ, ఇండోనేషియా మధ్య డిజిటల్ భాగస్వామ్యం, సిల్ డెవలప్మెంట్, టెక్నాలజీ ఇన్నోవేషన్స్, స్టార్టప్ ఎకో సిస్టం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. మరోవైపు కృత్రిమ మేధస్సుకు సంబంధించిన ఆవిషరణల వేదికగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం అమెరికా పెట్టుబడిదారులకు అనేక అవకాశాలను కల్పిస్తున్నదని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.