బడంగ్పేట్, ఫిబ్రవరి19: ప్రజలకు అవసరమైన అన్ని వస్తువులు ఒకే దగ్గర లభ్యంఅయ్యే విధంగా ఉండాలన్న సంకల్పంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమీకృత మార్కెట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తం గా ఏర్పాటు చేస్తున్న సమీకృత మార్కెట్లను మహేశ్వరం నియోజకవర్గంలో కూడా ఏర్పా టు చేయించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి ..అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకపోవడం జరిగింది. మంత్రి విజ్ఞప్తి మేరకు మహేశ్వరం నియోజకవర్గంలో నాలుగు చోట్ల సమీకృత మార్కెట్లను ఏర్పాటు చేయడానికి బడంగ్పేట్, తుక్కుగూడ, మీర్పేట్, జల్పల్లిలో స్థలాలను పరిశీలించారు. ఒక్కో మార్కెట్కు రూ.4.50 కోట్లు కేటాయించారు. బడంగ్పేట్, తుక్కుగూడ, జల్పల్లిలో కొంత మేరకు పనులు చేపట్టారు.
గతంలో మధ్యస్థంగా ఆగిన పనులను పునరుద్ధరించాలన్న ఆలోచనను ప్రభుత్వం మర్చిపోయింది. మీర్పేట్లో స్థల సమస్య ఉండటం తో కొంత జాప్యం జరిగింది. సమీకృత మా ర్కెట్ పనులు జరుగుతున్న క్రమంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దీంతో సమీకృత మార్కెట్ పనులు మధ్యలోనే నిలిపివేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత సంబంధిత అధికారులు సమీకృత మార్కెట్ పనులను పరిశీలించి పనులు మొదలు పెట్టి పూర్తి చేయించాలన్న జాస మార్చిపోయారు. మం జూరైన నిధులు ఏమైయిన్నట్లో ఎవరికి తెలియదు. మర్కెట్ పనులు పునరుద్ధరిం చాలన్న సోయిలేకుండా పోయింది.
మార్కెట్ పనులు పట్టవా..
ప్రజలు ఒక్కో వస్తువు కోసం వివిధ చోట్ల కు పోకుండా అన్నీ ఒకే చోట లభించే విధంగా ఉండాలన్న ఉద్ధేశంతో ఏర్పాటు చేస్తున్న సమీకృత మార్కెట్ పనులు గాలికి వదిలేశారు. కోట్ల రూపాయలతో ప్రారంభించిన పనులు మధ్యలోనే ఆగిపోయాయి. కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు మార్కెట్ పనుల గురించి ఆరా తీసిన దాఖలాలు లేవు. ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన వాటిపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. మధ్యంతరంగా ఆగిపోయిన పనులను పునరుద్ధరించాలన్న ఆలోచనను చెత్తబుట్టలో వేశారు. ఇక సమీకృత మార్కెట్ పనులు ఇప్ప ట్లో అయ్యేటట్లులేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. వివిధ రకాల వ్యాపారాలు చేసేవారు మార్కెట్ అవుతుందన్న ఉద్ధేశంతో చుట్టు పక్కల షాపులు కొని పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్ అయ్యే పరిస్థితి లేదని తీసుకున్న షాపులను మూసి వేస్తున్నారు. ప్రజలకు సంబంధించిన పనులను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.
అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా ..
బడంగ్పేట్, తుక్కుగూడ, జల్పల్లిలో కొంత మేరకు నిర్మాణం చేసి వదిలేసిన సమీకృత మార్కెట్లు అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయని స్థానికులు వాపోతున్నా రు. రాత్రి సమయంలో గంజాయి రాయులకు నిలయంగా మారుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. బడంగ్పేట్ ప్రధాన రహదారిపై ఉండటంతో రాత్రి అయిందంటే మందు బాబులతోపాటు కొంతమంది రకరకాల కార్యకలాపాలకు అడ్డా చేసుకుంటున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సమీకృత మార్కెట్ పనులను పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
పనులు ప్రారంభమయ్యేలా కృషి
సమీకృత మార్కెట్ పనులు ఎందుకు నిలిపివేశారో సంబంధిత అధికారులతో మాట్లాతా ను. పనులు పరిశీలిస్తాను. సంబంధిత కాంట్రాక్టర్లు ఎందుకు మధ్యలో పనులు నిలిపి వేశారో తెలుసుకుంటాను. ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతాను. ప్రస్తుతం ఉన్న డీఈతో మాట్లాడుతాను. పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత పనులు మొదలు పెట్టే విధంగా చొరవ తీసుకుంటాను.
– సరస్వతి, బడంగ్పేట్ డీసీ