అర్వపల్లి, జూలై 17 : సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని కొమ్మాలలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ కార్యక్రమాన్ని కేంద్ర పరిశీలకుడు సాయి గురువారం పరిశీలించారు. గ్రామంలో చేపట్టిన పారిశుధ్య పనులను, మరుగుదొడ్ల నిర్వహణ, ఇంకుడు గుంతలు, మురుగునీటి నిర్వహణ, తడి పొడి చెత్త నిర్వహణ, వ్యక్తిగత పరిసరాలు, పరిశుభ్రత పాటించడం వంటి అంశాలను ఆయన క్షేత్రస్థాయిలో తిరుగుతూ పరిశీలించారు. అనంతరం రిజిస్టర్ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గోపి, గ్రామ పంచాయతీ స్పెషల్ అధికారి మాలోతు బిచ్చునాయక్, పంచాయతీ కార్యదర్శి నారాయణమూర్తి, పరహణ, శ్రీనివాస్, శైలజ పాల్గొన్నారు.