వ్యాపార కేంద్రంగా.. ఆదాయ వనరుగా..
స్వరాష్ట్రంలో సూర్యాపేట పట్టణం సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నది. జిల్లా కేంద్రం కావడంతో అన్ని హంగులు అద్దుకుంటున్నది. మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో పెద్దఎత్తున నిధులు సమకూరుతుండడంతో అన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
- సూర్యాపేట పట్టణం నడిబొడ్డున మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్
- రూ.4 కోట్లతో 44 దుకాణాల నిర్మాణం
- రాష్ట్రంలో మొట్ట మొదటగా
- పట్టణ ప్రగతి నిధుల వినియోగం
- మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రత్యేక
- దృష్టితో సరిక్తొత్తగా జిల్లా కేంద్రం
స్వరాష్ట్రంలో సూర్యాపేట పట్టణం సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నది. జిల్లా కేంద్రం కావడంతో అన్ని హంగులు అద్దుకుంటున్నది. మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో పెద్దఎత్తున నిధులు సమకూరుతుండడంతో అన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇప్పటికే రోడ్ల విస్తరణతోపాటు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. ప్రభుత్వ జనరల్ దవాఖానను అన్ని వసతులతో ఆధునీకరించగా మెడికల్ కళాశాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. ఒక మినీట్యాంక్ బండ్ పనులు పూర్తికాగా మరొకటి చేపడుతున్నారు. పచ్చని పార్కులు, పిల్లల కోసం ప్లే గేమ్స్ నిర్మించారు. ఇంటింటికీ సురక్షిత మంచినీరు అందుతుండగా సెంట్రల్ లైటింగ్ వ్యవస్థతో వెలుగులు విరజిమ్ముతున్నది. మున్సిపాల్టీ సొంతంగా ఆదాయం సమకూర్చుకునేందుకు పాత మున్సిపల్ కార్యాలయం స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. రాష్ట్రంలోనే మొట్ట మొదటగా పట్టణ ప్రగతి నిధులు రూ.4 కోట్లతో పనులు చేపట్టారు. నెలరోజుల్లో పనులు పూర్తికానుండగా పట్టణంలో ప్రధాన వ్యాపార కేంద్రంగా మారనున్నది.
ఆది నుంచి స్వయం సమృద్ధిగా సూర్యాపేట మున్సిపాల్టీ
1952లో ఏర్పాటైన సూర్యాపేట మున్సిపాల్టీ 1964లో సొంత కార్యాలయం కోసం భవనాన్ని ఖరీదు చేశారు. అనంతరం మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ హయాం 2003-04లో రూ. 10కోట్లతో 2.1 గుంటల ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసి వివేకానంద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. 80వేల చదరపు అడుగుల ఈ నిర్మాణంలో 40 ఫీట్ల రోడ్డును తీసి నిర్మించడంతో ఇప్పుడు అది మిర్యాలగూడ, నేరేడుచర్ల వెళ్లడానికి ప్రధాన రహదారిగా మారింది. మున్సిపల్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో వివేకానంద కాంప్లెక్స్‌లోకి మున్సిపల్ కార్యాలయాన్ని మార్చారు. దాంతో ఖాళీగా ఉన్న పాత మున్సిపల్ కార్యాలయ స్థలంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సహకారంతో రూ. 4కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పనులు చేపట్టారు. ఇందులో మొత్తం 44 వ్యాపార దుకాణాలు ఉండగా మహిళా సంఘాలు సమావేశాలు నిర్వహించుకునేందుకు పెద్ద హాల్‌ను నిర్మిస్తున్నారు.
ఆదాయం అదిరేలా ప్రణాళికలు
సూర్యాపేట మున్సిపాల్టీ సొంతంగా ఆదాయం సమకూర్చుకోవడంలో మిగతా మున్సిపాల్టీలకు ఆదర్శంగా నిలుస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా సూర్యాపేట మున్సిపాల్టీ చెత్త ద్వారా ప్లాస్టిక్ ఇటుకలు, టైల్స్ తయారు చేస్తూ ఆదాయం పొందుతున్నది. సూర్యాపేట మున్సిపాల్టీకి ఇప్పటి వరకు మూడు షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. ఇందులో ఉన్న 66 దుకాణాల్లో 53 అగ్రిమెంట్ ద్వారా నడుస్తుండగా 13దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. వీటి ద్వారా మున్సిపాల్టీకి ప్రతి నెలా సుమారు రూ. 5.50 లక్షల ఆదాయం వస్తున్నది. కొత్త షాపింగ్ కాంప్లెక్స్‌తో మరింత ఆదాయం సమకూరనున్నది.
భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా నిర్మాణం
మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నాం. పట్టణంలో ప్రధాన కూడలి కావడంతో ఇది వ్యాపార కేంద్రంగా మారుతుంది. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా నాణ్యతతో నిర్మిస్తున్నారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలి.
-పెరుమాళ్ల అన్నపూర్ణ, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్
రూ.2 నుంచి 3కోట్ల ఆదాయం వచ్చేలా..
షాపింగ్ కాంప్లెక్స్‌లో 44 దుకాణాలతోపాటు ఒక అంతస్తులో మహిళల కోసం ప్రత్యేకం పెద్ద హాల్‌ను నిర్మిస్తున్నాం. మున్సిపాల్టీకి సంవత్సరానికి రూ.2నుంచి రూ.3 కోట్ల ఆదాయం వచ్చేలా కృషి చేస్తున్నాం. మరో నెల రోజుల్లో షాపింగ్ కాంప్లెక్స్ అందుబాటులోకి వస్తుంది.
-పి.రామానుజులరెడ్డి, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్
వ్యాపారులకు మంచి అవకాశం
ప్రధాన రహదారులపై ఉన్న దుకాణాల యజమానులు భారీగా అడ్వాన్సులు, కిరాయిలు చెబుతున్నారు. వ్యాపారం చేసి రాణిద్దామనుకునే వారికి నిరాశే ఎదురవుతున్నది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయితే తక్కువ కిరాయికే దుకాణాలు వస్తాయని ఎదురు చూస్తున్నాం.
-జంపాల శ్రీను (సూర్యాపేట)
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

