రూ.11 లక్షల గుట్కా సీజ్
నిషేధిత గుట్కా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. సూర్యాపేట పట్టణంలో పోలీసుల తనిఖీల్లో ఆదివారం పట్టుబడిన సుమారు రూ.11 లక్షల విలువైన గుట్కా సీజ్ చేసిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసి సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
- నిషేధిత గుట్కా విక్రయిస్తే కఠిన చర్యలు
- సూర్యాపేట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
సూర్యాపేట టౌన్, జూలై 15 : నిషేధిత గుట్కా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. సూర్యాపేట పట్టణంలో పోలీసుల తనిఖీల్లో ఆదివారం పట్టుబడిన సుమారు రూ.11 లక్షల విలువైన గుట్కా సీజ్ చేసిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసి సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్పీ తెలిపిన వివరాలు.. స్థానిక రాజీవ్‌నగర్‌కు చెందిన మాయదేవర శివసత్తి,
పెన్‌పహాడ్ మండలం భక్తళాపురం గ్రామానికి చెందిన ఎర్రంశెట్టి నవీన్ ఇతర రాష్ర్టాల నుంచి నిషేధిత గుట్కాను తీసుకొచ్చి రెండు ఆటల్లో తరలిస్తుండగా శంకర్ విలాస్ సెంటర్లో ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఇరువురిని అదుపులోకి తీసుకొని విచారించగా వారికి సంబంధించిన కూరగాయ మార్కెట్లోని మంజూ బేకరీ అండ్ కిరాణ దుకాణంలో గుట్కా నిల్వ ఉంచి అక్కడి నుంచి విక్రయాలు జరుపుతామని ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు దాడులు జరిపి గుట్కాను సీజ్ చేసి ఇరువురు రిమాండ్‌కు తరలించారు.
చాకచక్యంగా కేసును గుట్కా కేసును చేధించిన పట్టణ సీఐ జి. రాజశేఖర్, ఎస్ఐ మహేంద్రనాథ్, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ నాగేశ్వర్రావు, డీఎస్పీ రవి ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
Census 2027 | తెలంగాణలో జనగణనకు నోటిఫికేషన్ జారీ.. తేదీలు ఇవే
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

