Suryapet: 25న ఎస్పీ బాలు సంగీత విభావరి

బొడ్రాయిబజార్: గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈ నెల 25న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్హాల్లో నిర్వహించే ఎస్పీ బాలు సంగీత విభావరి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, సంగీత ప్రియులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మనం వికాస వేదిక అధ్యక్ష, కార్యదర్శులు పెద్దిరెడ్డి గణేశ్, డీఎస్వీ శర్మలు కోరారు.
ఈ మేరకు బుధవారం స్థానిక మంత్రి జగదీశ్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో సంగీత విభావరి కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ఎస్పీ బాలు తన జీవిత కాలంలో సందర్శించిన పట్టణాల్లో సూర్యాపేట ఒకటి అని అన్నారు. అలాంటి మహానుభావుడిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గురువారం నుంచి పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఎస్పీ బాలు పాటల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, సినీ దర్శకుడు శివనాగేశ్వర్రావులు హాజరవు తున్నట్లు తెలిపారు. ఎస్పీబీ గారికి నివాళులర్పించిన అనంతరం ప్రభవ మ్యూజిక్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో బాలు పాడిన పాటలతో సంగీత విభావరి సాగుతుందన్నారు.
సంగీత ప్రియులు, పట్టణ ప్రజలు, బాలు అభిమానులు కరోనా నిబంధనల మేరకు హాజరై విజయ వంతం చేయాల్సిం దిగా కోరారు. కా ర్యక్రమంలో మనం వికాస వేదిక సభ్యులు గెల్లి అంజన్‌ప్రసాద్, రాజశేఖర్, చిట్టిపాక వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

