సూర్యాపేట లీగల్, ఫిబ్రవరి 3 : ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ సూచించారు. అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సూర్యాపేట కోర్టు ప్రాంగణంలో క్యాన్సర్‌పై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో సూర్యాపేట మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్.అమరావతి, సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పి.శ్రీవాణి, ప్రధాన, అదనపు జూనియర్ సివిల్ జడ్జిలు, హెచ్ఓలు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ సుశాంక్, డాక్టర్ స్రవంతి, పీపీ పి.లింగయ్య, సవీందర్, న్యాయవాదులు పాల్గొన్నారు.