బొడ్రాయిబజార్, సెప్టెంబర్ 11 : విసునూరు దేశముఖ్లను, జమిందార్లను, నైజాం రజాకార్లను గడగడలాడించిన వీర వనిత, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాట పటిమ మరువలేనిదని చాకలి ఎస్సీ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షురాలు కొత్తకొండ లక్ష్మి అన్నారు. ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఎస్సీ సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సట్టు నాగయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు అంజద్‌అలీ, నాయకులు దూదిగామ గోపాల్, అన్నపర్తి రాజేశ్, మైలారపు రమేశ్, కాంగ్రెస్ నాయకులు రావుల రాంబాబు, చెంచల శ్రీనివాస్, సీపీఎం నాయకులు ముల్కలపల్లి రాములు, కోట గోపి, యాదగిరిరావు, ఎల్గూరి గోవింద్, దండ వెంకట్‌రెడ్డి, ఏకలక్ష్మి, చెరుకు సత్యం పాల్గొన్నారు.
ఆత్మకూర్.ఎస్ :మండలంలోని నెమ్మికల్ గ్రామంలో ఐలమ్మ 36వ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ రజక సేవా సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చెరుకు వెంకన్న, నాయకులు మోరపాక రాజు, మోరపాక సుధాకర్, మల్లయ్య, గంగమ్మ, జాని, శంకర్, దామోదర్, ఎల్లుట్ల మల్లయ్య, వెంకన్న, శ్రవణ్ పాల్గొన్నారు.
తుంగతుర్తి : మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ చిత్రపటానికి మండల రజక సంఘం నాయకులు శుక్రవారం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో రజక సంఘం జిల్లా నాయకుడు చెరుకు వెంకన్న, మండల నాయకులు పూసపల్లి శ్రీనివాస్, వెంకన్న, రాజు, యాదగిరి, శ్రీనివాస్, నాగయ్య పాల్గొన్నారు.