సూర్యాపేట, ఆగస్టు 7 : ఈ నెల 15న స్వాతంత్య్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో శనివారం స్వాతంత్య్ర వేడుకలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉన్నదని చెప్పారు. అప్పటి వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కలెక్టరేట్ లేదా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వేడుకలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. వేడుకల్లో ప్రొటోకాల్ తప్పని సరిగా పాటించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాఠశాలల విద్యార్థులు పాల్గొనేలా చూడాలన్నారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రతిభ ఆధారంగా ప్రశంసా పత్రాలు అందించనున్నట్లు ఇందుకు శాఖల వారీగా ఉద్యోగులకు ఎంపిక చేయాలన్నారు. అలాగే శాఖల వారీగా అభివృద్ధ్ది ప్రతిబింబించేలా స్టాళ్లు, శకటాలు తయారు చేసుకోవాలన్నారు. వేడుకల్లో కరోనా నిబంధనలు తప్పక పాటించాలన్నారు. సమావేశంలో సూర్యాపేట ఆర్డీఓ రాజేంద్రకుమార్, డీఆర్డీఓ కిరణ్‌కుమార్, ఐసీడీఎస్ పీడీ నర్సింహారావు, సీపీఓ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం, డీపీఓ యాదయ్య, ఈఈ ఆర్ అండ్ బీ యాకూబ్, ఈఈ మిషన్‌భగీరథ వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏఓ శ్రీదేవి, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.