గుడిపల్లి, జనవరి 14 : క్రీడాకారులకు ఏ రకమైన సహాయ సహకారాలు అందించేందుకైనా తాను ముందు వరుసలో ఉంటానని నల్లగొండ జిల్లా గుడిపల్లి సర్పంచ్ తెలిపారు. దేవరకొండలో జరిగిన నియోజకవర్గ స్థాయి నేనావత్ అభిలాష్ నాయక్ కబడ్డీ ఛాలెంజ్ ట్రోఫీలో గుడిపల్లి జట్టు ప్రథమ బహుమతిని గెలుచుకోవడం అభినందనీయమని ఆయన అన్నారు. బుధవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో క్రీడాకారులను సర్పంచ్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకుడు, ఉమ్మడి మండల వైస్ ఎంపీపీ అర్వపల్లి సరిత నరసింహ, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎర్ర యాదగిరి, సింగల్ విండో మాజీ డైరెక్టర్ పోశంరెడ్డి శైలజ వెంకటరెడ్డి, పోల వెంకట్ పాల్గొన్నారు.