భువనగిరి అర్బన్, మే19 : జూన్ 14న సబ్ నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వి.మాధవిలత సోమవారం ప్రకటనలో తెలిపారు. ఇందులో అన్ని సివిల్, క్రిమినల్ కాంపౌండబుల్, ప్రీ లిటిగేషన్ విషయాల పరిష్కారం కోసం ప్రీ సిట్టింగ్‌లను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
జాతీయ లోక్ అదాలత్ దృష్ట్యా జిల్లాలోని ప్రతి కోర్టులో లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై విస్తృత ప్రచారం చేయాలని, దీనికి సంబంధించిన వీడియో, ఆడియో క్లిప్‌లను జిల్లాలోని అన్ని పంచాయతీ కార్యదర్శులకు పంపించాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.