కట్టంగూర్, ఆగస్టు 11: విద్యార్థులు శ్రద్ధతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మోటివేషనల్ స్పీకర్స్ గూడూరు అంజిరెడ్డి, ప్రవీణ్ అన్నారు. సోమవారం కట్టంగూర్ మండలంలోని ఈదులూరు ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ సల్లగొండ స్టార్స్, ఇంపాక్ట్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో యువ వికాసంలో భాగంగా విద్యార్థులకు లక్ష్య సాధనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చదువుతో పాటు సంస్కారం పెంపొందించుకుని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవించాలన్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ సభ్యుడు నవీన్ సహకారాంతో టై, బెల్ట్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, సభ్యులు బండ నర్సిరెడ్డి, ఇంద్రకంటి ఇంద్రారెడ్డి, గుండ్ల అంజిరెడ్డి, పక్కీరు వెంకట్ రెడ్డి, నవీన్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.