రామగిరి, అక్టోబర్ 09 : మన దైనందిన జీవితంలో సైన్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని, కావునా పాఠశాల స్థాయి నుండే విద్యార్థులంతా సైన్స్‌పై పట్టు సాధించాలని నల్లగొండ డీఈఓ బి.భిక్షపతి అన్నారు. నల్లగొండలోని ప్రభుత్వ బీఈడీ కళాశాల సమావేశ మందిరంలో విశ్వేశ్వరయ్య ఇండస్ట్రీయల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం బెంగుళూరు, జిల్లా విద్యాశాఖ, దక్షిణ భారత సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలకు ఆయన హాజరై మాట్లాడారు. సైన్స్‌పై పరిజ్ఞానం విద్యార్థులకు ఎంతో దోహద పడుతుందన్నారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులు ఈ నెల 17, 18న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ సైన్స్ అంశాల్లో విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతి, న్యాయ నిర్ణేత, ప్రభుత్వ జూనియర్ కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకుడు వేణుగోపాల్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
– ప్రథమ స్థానం- ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆర్చీ రోడ్డు – నల్లగొండ
– ద్వితీయ స్థానం- సెయింట్ ఆల్ఫోన్స్ హైస్కూల్, నకిరేకల్
– తృతీయ స్థానం టీజీఎస్ డబ్ల్యూఆర్ఎఎస్ బాలికలు, నకిరేకల్
Ramagiri : విద్యార్థులు సైన్స్‌పై పట్టు సాధించాలి : డీఈఓ భిక్షపతి