రామగిరి, ఆగస్టు 07 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్శిటీలో గురువారం విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. అటెండెన్స్ లోపం కారణంగా పలువురు విద్యార్థులను డిటెండ్ చేసిన యూనివర్సిటీ చర్యను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆర్ట్స్ కాలేజీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. వైస్ ఛాన్సలర్ విద్యార్థుల సమస్యలను పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. తక్షణమే విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు వీసీ చొరవ తీసుకోవాలన్నారు లేదంటే నిరసన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, బీఆర్ఎస్వీ, పీడీఎస్యూ నాయకులు పాల్గొన్నారు.