‘సత్వర న్యాయం అందే విధంగా కృషి’
న్యాయవాదులు ఆశించిన విధంగానే ఎక్కడ పని చేసినా సత్వర న్యాయం అందే విధంగా కృషి చేస్తామని నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు, నల్లగొండ జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి జి.సంపూర్ణ ఆనంద్ తెలిపారు. మానవతా దృక్పథం ఉన్నచోట న్యాయం, ధర్మం నిలబడుతుందన్నారు.
– న్యాయమూర్తులు ఎం.నాగరాజు, జి.సంపూర్ణ ఆనంద్
రామగిరి, ఏప్రిల్ 13 : న్యాయవాదులు ఆశించిన విధంగానే ఎక్కడ పని చేసినా సత్వర న్యాయం అందే విధంగా కృషి చేస్తామని నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు, నల్లగొండ జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి జి.సంపూర్ణ ఆనంద్ తెలిపారు. మానవతా దృక్పథం ఉన్నచోట న్యాయం, ధర్మం నిలబడుతుందన్నారు. న్యాయం,ధర్మం పట్ల అంకితభావంతో ప్రతి ఒక్కరం పనిచేయాలన్నారు. సోమవారం నల్లగొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు వికారాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా, నల్లగొండ జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి జి.సంపూర్ణ ఆనంద్ రంగారెడ్డి జిల్లా కోర్టుకు చైర్మన్, ల్యాండ్ రిఫార్మ్స్ అప్పిలేట్ ట్రీబ్యునల్గా, అలాగే రెండవ అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి కోర్టు, అదనపు సెషన్స్ జడ్జి కోర్టుకు బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఘనంగా వీడ్కోలు పలకడం జరిగింది. ఈ సమావేశానికి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ.సతీష్ కుమార్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ.. వృత్తిరీత్యా బదిలీపై వెళ్లడం అనేది సహజమైన ప్రక్రియలో భాగమైనప్పటికీ, బదిలీపై వెళ్తున్న సందర్భంలో న్యాయవాదులు బాధను వ్యక్తం చేయడం మేము కూడా సహజంగా బాధపడే విషయం అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయవాదులతో ఉన్న అనుబంధం మర్చిపోలేనిది అన్నారు. ఉన్నతాధికారుల మరియు న్యాయవాదుల సహకారంతో నల్లగొండ జిల్లా కేంద్రంలో నూతన బిల్డింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుక రావడంలో శక్తి వంచన లేకుండా పని చేశామన్నారు. లోక్ అదాలత్ లో కూడా నల్లగొండ జిల్లాకు మంచి స్థానం రావడంలో అధికారులు న్యాయవాదులు అందించిన సహకారం ప్రశంసనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బచ్చనబోయిన అశోక్ కుమార్,సీనియర్ న్యాయవాదులు రామచందర్ రావు, మునగాల నారాయణరావు, నూకల నరసింహారెడ్డి, అమరేందర్ రెడ్డి, జి.జవహర్ లాల్, మేడ మోహన్ రెడ్డి, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పజ్జురి స్వామి గౌడ్, నూకల సంధ్యారాణి, సహాయ కార్యదర్శి సూరేపల్లి అమరావతి, కోశాధికారి ఎండి ఫిరోజ్, గేమ్స్ సెక్రటరీ నారబోయిన ప్రసన్నకుమార్, సభ్యులు గుర్రం వెంకట్ రెడ్డి, పులిజాల కార్తీక్, రామకృష్ణ, సుమశ్రీ, నాంపల్లి భాగ్యమ్మ, పందుల సైదులు, దువ్వ గీత, ఎం.ప్రగతి, కే ఎన్ కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

