నల్లగొండ ఏప్రిల్ 18 : జిల్లాలో ప్రభుత్వ రికగ్నైజ్డ్ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన స్కూల్ బస్సులను పెండ్లిండ్లు, శుభకార్యాలు, ఫంక్షన్ లకు ఉపయోగిస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణా అధికారి సురేష్ రెడ్డి ఒక ప్రకటన లో హెచ్చరించారు. స్కూల్ బస్సులు పిల్లలను తీసుకు వెళ్లేందుకు స్కూల్ కు సంబంధించిన కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని, పెండ్లిండ్లు, శుభకార్యాలు, ఫంక్షన్ లకు వాడుతూ దుర్వినియోగం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
ఫంక్షన్లు, ఇతర శుభ కార్యక్రమాలకు స్కూల్ బస్సులు వాడితే ఏమైనా అనుకోని ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ వర్తించదని, ఆర్థికంగా కూడా నష్ట పోతారని ఆయన హెచ్చరించారు. డి.సి.యం వాహనాలు కూడా గూడ్స్ రవాణా కాకుండా ప్యాసెంజర్ లను తీసుకు వెళ్లి దుర్వినియోగం చేస్తే సంబంధింత వాహన యజమానులపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఒక ప్రకటనలో హెచ్చరించారు.