కట్టంగూర్, మార్చి 19 : తప్పుడు ధ్రువపత్రాలు, నకిలీ సర్టిఫికెట్లతో అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ ఆర్డీఓ యారాల అశోక్ రెడ్డి హెచ్చరించారు. కట్టంగూర్ మండలంలోని చెరువు అన్న రెవెన్యూ పరిధిలో ఆరు ఎకరాల 18 గుంటల భూమి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్న బాధితుల ఫిర్యాదు మేరకు బుధవారం తాసిల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
తెలువారిగూడెం గ్రామానికి చెందిన వంగూరు చంద్రయ్యకు చెరువన్నారం రెవెన్యూ పరిధిలో 155 157 161 162 సర్వే నంబర్ల లో ఆరు ఎకరాల 18 గుంటల భూమి ఉండగా అతను 2016లో మృతి చెందాడని తెలిపారు. అదే గ్రామానికి చెందిన వంగూరు సైదులు ఇద్దరు వ్యక్తులు మరణించినా చంద్రయ్య వారసులమంటూ 2022 సెప్టెంబర్ 3న అక్రమ రిజిస్ట్రేషన్ కు పాల్పడ్డామని విచారణలో ఒప్పుకున్నారని తెలిపారు. ఇటి విషయాన్ని కలెక్టర్ కు నివేదించి అక్రమ రిజిస్ట్రేషన్ రద్దుచేసి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. విచారణలో తాసీల్దార్ ప్రసాద్, డిప్యూటీ తాసీల్దార్ సుకన్య, బాధితులు వంగూరి రామ్మూర్తి, రవి పాల్గొన్నారు.