రామగిరి, జనవరి 06 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ (ఐఎంఎస్) ఏర్పాటుకు చర్యలు జరుగుతున్నాయి. వర్సిటీ సందర్శనకు, వివిధ పనులపై ఉమ్మడి జిల్లా నుండి వచ్చే కళాశాలల నిర్వాహకులు, విద్యార్థులు, వర్సిటీలో పనిచేసే వారు టిఫీన్స్, భోజనం చేయాలంటే ఇప్పటి వరకు చాలా కష్టంగా ఉంది. ఇందుకోసం వర్సిటీ నుండి సుమారు 2 కిలోమీటర్ల వెళ్లాల్సి ఉండటంతో అర్థాకాలితోనే తమ పనులు ముగించుకుంటున్న సందర్భాలున్నాయి. వీటిని అధిగమించేలా మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఎంజీయూలో ఇందిర మహళా శక్తి క్యాంటీన్ ఏర్పాటుకు డీఆర్డీఏ అధికారులు సమ్మతి తెలిపారు. దీంతో వర్సిటీలోని యాంపీ థియేటర్ వద్ద క్యాంటీన్ ఏర్పాటుకు స్థలంను వర్సిటీ అధికారులు కేటాయించారు. క్యాంటీన్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది.